Site icon NTV Telugu

IPL 2022 : ముగిసిన ఆర్‌సీబీ బ్యాటింగ్‌.. గుజరాత్‌ లక్ష్యం 171

Rcb Gt

Rcb Gt

Royal Challengers Bangalore Batting End .. Gujarat target 157 runs.

ఐపీఎల్‌ సీజన్‌-2022లో నేడు మరో ఆసక్తికర పోరుకు బ్రబౌర్న్‌ వేదిక అవుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే.. ఆర్‌సీబీ తొలి వికెట్‌ను 11 పరుగుల వద్ద కోల్పోయింది. ప్రదీప్‌ సంగ్వాన్‌ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చిన డుప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే విరాట్ కోహ్లి (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్‌), ర‌జ‌త్ ప‌టిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోరు చేరుకోగలిగింది.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆర్‌సీబీ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. 19వ ఓవ‌ర్లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఫెర్గుస‌న్ పెవిలియ‌న్‌కు పంపించ‌డంతో ఆర్సీబీ భారీ స్కోరు ఆశ‌లకు గండిప‌డినట్లైంది. ఆఖ‌రి ఓవ‌ర్లో లోమ్రార్ ఓ సిక్సర్ బాదగ, ఫోర్ స‌హా 15 ప‌రుగులు రాబ‌ట్ట‌డంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా వచ్చింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌దీప్ సాంగ్వాన్ 2 , ష‌మీ, జోస‌ఫ్‌, ఫెర్గుస‌న్‌, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

Exit mobile version