NTV Telugu Site icon

టెస్టు క్రికెట్‌లో నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా జడేజా…

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా ఆవిర్భవించాడు. టెస్టులకు సంబంధించి ఐసీసీ విడుదల చేసిన టాప్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. రెండు రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంతో జేసన్‌ హోల్డర్‌ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. బెన్‌స్టోక్స్‌ , రవిచంద్రన్‌ అశ్విన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనే కాకుండా బౌలర్ల జాబితాలోనూ అశ్విన్‌ టాప్-5లో ఉన్నాడు. 850 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ జడేజా టాప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు.