Site icon NTV Telugu

RR vs LSG: దుమ్మురేపిన యంగ్‌స్టర్స్.. లక్నో టార్గెట్ 179

Rr Vs Lsg

Rr Vs Lsg

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో పెద్దగా సత్తా చాటని యువ ఆటగాళ్ళు.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్ క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే లక్నో బౌలర్స్‌పై దండయాత్ర చేశాడు. దీంతో 29 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌తో 41 పరుగులు చేశాడు.

సెంచరీల ధీరుడు జాస్ బట్లర్ 2 పరుగులకే వెనుదిరగగా.. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. తదనంతరం వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్ళు తమవంతు స్కోర్స్ జోడించడంతో.. రాజస్థాన్ జట్టు స్కోర్ 178/6 కి చేరింది. అటు బౌలింగ్ విషయానికొస్తే.. మోహసీన్, చమీరా పరుగుల్ని బాగా సమర్పించుకున్నారు. రవి బిష్ణోయి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. అన్వేశ్ ఖాన్, జేసన్ హోల్డర్, ఆయుశ్ బదోని చెరో వికెట్ తీశారు. 179 పరుగుల టార్గెట్‌తో రంగంలోకి దిగిన లక్నో.. ఆ లక్ష్యాన్ని చేధించగలుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version