ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు హెట్‌మెయిర్ స్వదేశానికి పయనం అయ్యాడు. అతడి భార్య ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్ గయానాకు వెళ్లాడు. అయితే త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను అత్యవసర పనిమీద తాను స్వదేశానికి వెళ్తున్నానని.. తన కిట్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూంలోనే ఉందని ఇన్‌స్టా్‌గ్రామ్ వేదికగా తెలియజేశాడు.
కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మెయిర్ 291 పరుగులు చేశాడు. ఏడు మ్యాచ్‌లలో ఏకంగా నాటౌట్‌గా నిలిచాడు. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడి రాజస్థాన్ జట్టుకు భారీ స్కోర్లు అందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో 214.28 స్ట్రైక్ రేట్‌తో హెట్‌మెయిర్ బ్యాటింగ్ చేయడం విశేషం. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఏడు విజయాలు సాధించి నాలుగు పరాజయాలను చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
IPL 2022: భారీ స్కోర్లలో CSKదే రికార్డు.. రెండో స్థానం ఎవరిదంటే..?