NTV Telugu Site icon

సెమీస్‌లో పీవీ సింధుకు కఠిన సవాల్

PV Sindhu

PV Sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగు తేజం పీవీ సింధు… శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ అకానా యమగూచిపై విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించారు.. తద్వారా ఓ అరుదైన రికార్డును కూడా సాధించగారు.. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించారు.. అయితే, ఇవాళ జరగనున్న సెమీస్‌ సింధుకు కఠిన సవాల్ గా చెప్పాలి.. ఎందుకుంటే వరల్డ్ నెంబర్ వన్‌ తైజుయింగ్‌తో ఈ మ్యాచ్‌ జరగనుంది.. ఇప్పటివరకు సింధు, తైజుయింగ్‌తో 18 సార్లు తలపడగా కేవలం ఐదు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన తైజుయింగ్‌ 12 మ్యాచ్‌ల్లో విజయాన్ని నమోదు చేశారు.. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది.

తన కేరీర్‌లో మెత్తం 558 మ్యాచ్‌ల్లో 406 గెలిచిన తైజుయింగ్‌.. ప్రపంచ నెంబర్ వన్‌ స్ధానంలో కొనసాగుతోంది. అయితే, తైజుయింగ్‌ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలుచుకోలేదు.. ఈసారి మెడల్ లక్ష్యంగా పట్టుదలతో ఆడుతోంది.. లండన్‌, రియో ఒలింపిక్స్‌లో ఆడిన తైజుయింగ్‌ కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌ కూడా చేరుకోలేకపోగా.. రియో ఒలింపిక్స్‌లో సింధు చేతిలో తైజుయింగ్ ఓటమి పాలైంది. అయితే, ఈసారి సింధూని ఓడించాలని తైజు టార్గెట్‌గా పెట్టుకుంది.. మరోవైపు.. 2020 వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధును ఓడించింది తైజుయింగ్.. దీంతో.. ఇవాళ్టి మ్యాచ్‌ ఉత్కంఠగా మారిపోయింది.. సెమీస్‌లో సింధు విజయం సాధించాలని భారత్‌ మొత్తం కోరుకుంటుంది.