Site icon NTV Telugu

ఒలంపిక్స్ లో సింధు శుభారంభం…

టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. అయితే గత ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధు ఈ ఏడాది అలాగైనా గోల్డ్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

ఇక మరోవైపు హైదరాబాదీ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా డబుల్స్‌ తొలి మ్యాచ్‌ ఈరోజు ఆడగా అందులో ఓటమిపాలైంది. సానియా మీర్జా, అంకిత రైనా ద్వయం.. ఉక్రెనియన్‌ జంటతో తలపడి ఓడిపోయింది.

Exit mobile version