Site icon NTV Telugu

సెమీస్ లో సింధూ ఓటమి…

టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనా కి చెందిన వరల్డ్ నెంబర్ వన్‌ తైజుయింగ్‌ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభ సమయం నుండి తీవ్ర ఒత్తిడిలో ఆడింది సింధూ. ఔట్ ఆఫ్ ది లైన్ కొడుతూ… పాయింట్స్ ను చేజార్చుకుంది. దాంతో పీవీ సింధుకు 18-21,12-21 తో వరుస సెట్లలో ఓడిపోయింది. ఇక గత ఒలింపిక్స్ లో సింధూ చేతిలో ఒడిన తైపీ ఇప్పుడు సింధూ పై గెలిచి తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ లోకి తైజుయింగ్‌ అడుగు పెట్టింది. అయితే సెమీస్ లో ఓడిన సింధూ కాంస్య పతకం కోసం మరో చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ హీ బింగ్జియావో తో తలపడాల్సి ఉంది.

Exit mobile version