Site icon NTV Telugu

స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు మరోసారి ఎన్నికైంది. ఈ విషయాన్ని స్వయంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. పీవీ సింధుతోపాటు మరో ఐదుగురిని బ్యాడ్మింటన్ వరల్డ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా నియమించినట్లు BWF ప్రకటించింది. ఈ ఆరుగురు 2025 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది.

Read Also: వైర‌ల్‌: వ‌ధూవ‌రుల డ్యాన్స్… మ‌ధ్య‌లో అనుకోని అతిధి రావ‌డంతో…

కొత్త నియామకం అయిన సభ్యుల్లో అమెరికా నుంచి ఐరిస్ వాంగ్, నెద‌ర్లాండ్ నుంచి రాబిన్ టేబిలింగ్, ఐఎన్ఏ నుంచి గ్రేసియా పోలీ, కొరియా నుంచి కిమ్ సోయోంగ్, చైనా నుంచి జెంగ్ సీవీతో పాటు భార‌త్ నుంచి పీవీ సింధు ఉన్నారు. కాగా ఈనెల 17న స్పెయిన్‌లో అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. గతంలో కూడా పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా వ్యవహరించింది.

Exit mobile version