Site icon NTV Telugu

PBKS vs RR: శివాలెత్తిన శిఖర్ ధవన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

Pbks Vs Rr

Pbks Vs Rr

Punjab Kings Scored 197 Against Rajasthan Royals: బర్సాపర స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అద్భుతంగా రాణించడం వల్లే పంజాబ్ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. మధ్యలో జితేశ్ శర్మ (27) సైతం కాసేపు మెరుపులు మెరిపించాడు. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేయడానికి పంజాబ్ జట్టు రంగంలోకి దిగింది. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే.. పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ అయితే చెలరేగిపోయాడు. ఓవైపు ధవన్ నిదానంగా తన ఇన్నింగ్స్ ఆడుతుంటే.. మరోవైపు ప్రభ్‌సిమ్రన్ వరుస బౌండరీలతో పరుగుల వర్షం కురిపించాడు. వీళ్లిద్దరు కేవలం 9.3 ఓవర్లలోనే మొదటి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

Imran Khan: లాహోర్‌ కోర్టుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని.. ఇమ్రాన్ తలకు బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్

ప్రభ్‌సిమ్రన్ ఔటయ్యాక.. శిఖర్ ధవన్ శివాలెత్తాడు. ప్రత్యర్థి బౌలర్లపై తాండవం చేయడం మొదలుపెట్టాడు. రాజపక్స రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో.. జితేశ్ శర్మతో కలిసి తమ జట్టు స్కోరుని ముందుకు నడిపించాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 68 పరుగుల పార్ట్నర్‌షిప్ జోడించారు. ఆ తర్వాత వికెట్లు పడినా.. శిఖర్ ఒత్తిడికి గురవ్వకుండా తన జోరు కొనసాగించాడు. ఎడాపెడా షాట్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ముచ్చెమటలు పట్టించాడు. ఫలితంగా.. నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్ జట్టు 197 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో.. జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. హోల్డర్ నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. అశ్విన్ 25 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీసినా.. నాలుగు ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు.

Prostitution Racket: స్పా ముసుగులో పాడుపని.. 20 మందిని కాపాడిన పోలీసులు

Exit mobile version