Pro Kabaddi: కబడ్డీ ఫ్యాన్స్ కు ఇక కావాల్సినంత వినోదం దొరికేసింది. ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇవాళ్టి ( ఆగస్టు 29) నుంచే లీగ్ 12వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ పోటీ పడబోతుంది. రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ తో పుణెరి పల్టాన్ తలపడబోతుంది. అయితే, ఏడేళ్ల విరామం తర్వాత విశాఖపట్నంలో ఈ టోర్నీ జరగబోతుంది. అయితే, ఈ సీజన్‌లో స్ట్రాంగ్ గా పోటీ ఇస్తామని తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్ పేర్కొన్నాడు.
Read Also: Diamond League Final: డైమండ్ లీగ్ ఫైనల్‌లో రన్నరప్ గా నీరజ్ చోప్రా.. ఛాంపియన్ ఎవరంటే?
అయితే, ప్రతి ఫ్రాంఛైజీ తన జట్టును బలోపేతం చేసుకుని వస్తుంది.. ప్రతి మ్యాచూ రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉందని తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్ తెలిపారు. ఏ మ్యాచ్ కూడా తేలిక తీసుకునే ఛాన్స్ లేదు. ప్రతి విజయం ఆయా జట్లు కష్టపడాల్సిందేనన్నారు. జాతీయ క్రీడా దినత్సోవం సందర్భంగా ఇవాళ పలువురు క్రీడాకారులను గౌరవిస్తామని లీగ్ ఛైర్మన్ అనుపమ్ గోస్వామి వెల్లడించారు. కబడ్డీ జట్ల కెప్టెన్లతో కలిసి ఆయన ఆర్కేబీచ్‌లోని ఐఎన్‌ఎస్ కురుసుర జలాంతర్గామి మ్యూజియం దగ్గర ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ పోటీలను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభిస్తారని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
Read Also: India Russian Oil Imports: అమెరికాకు షాక్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్..
ఇక, లీగ్ దశలో మొత్తం 108 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు 18 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాయింట్ల విధానంలో మార్పులు చేశారు. మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు.. ఓడిన జట్టుకు ఏమీ రావు.. ప్రస్తుత సీజన్‌లో మ్యాచ్ టై అయితే ప్రత్యేక నిబంధనలతో 5 రెయిడ్‌ల షూటౌట్ రౌండ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు కూడా రెండు జట్లు సమంగా ఉంటే గోల్డెన్ రెయిడ్ విజేతను నిర్ణయిస్తుంది అని లీగ్ నిర్వహకులు పేర్కొన్నారు. అప్పటికీ ఫలితం రాకపోతే టాస్ ద్వారా విజేతను ఎంపిక చేయనున్నారు. లీగ్ దశలో టాప్-8లో ఉన్న టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి.
Read Also: Kamareddy: బీబీపేట పెద్ద చెరువుకు బుంగ.. విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు
కబడ్డీ జట్లు: తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్, పట్నా పైరేట్స్, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, తమిళ్ తలైవాస్, యు ముంబా.
