ఐపీఎల్ సీజన్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాణిస్తోంది. ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కాగా, ఇదే మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ తరఫున రాణించలేకపోయాడు. ప్రస్తుత ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ మ్యాక్స్‌వెల్ చెలరేగిపోయాడు. ఆర్సీబీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 3 మ్యాచుల్లోనే 176 పరుగులు చేశాడు. ఇదే మ్యాక్స్‌వెల్ పంజాబ్ తరఫున పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటకట్టుకోగా.. ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున చెలరేగిపోవడంపై పంజాబ్ యజమాని ప్రీతి జింతా మండిపోతున్నట్లుగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సందర్భానికి తగ్గట్టు ట్రోల్స్ ఉండటంతో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
మ్యాక్స్‌వెల్ ను చూస్తే.. ప్రీతీకి మండిపోతుందా?
