NTV Telugu Site icon

Asia Cup 2022: పాక్ చేతిలో టీమిండియా ఎలా ఓడిపోయిందంటే…

Pak India

Pak India

LIVE : Pakistan won by 5 wkts | NTV SPORTS

దాయాదుల పోరు చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపింది. దుబాయ్ వేదికగా టీమిండియాతో సూపర్-4లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో పాకిస్థాన్ జట్టును ఆదుకున్నాడు. అతడు 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. రిజ్వాన్‌కు మహ్మద్ నవాజ్ సహకారం అందించాడు. నవాజ్ 20 బంతుల్లో 42 పరుగులు చేశాడు. నవాజ్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే కీలక సమయంలో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్ దీప్ సింగ్ నేలపాలు చేశాడు. దీంతో పాకిస్థాన్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఈ విజయంతో లీగ్ మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి పాకిస్థాన్ బదులు తీర్చుకుంది.