Site icon NTV Telugu

ధోని కోసం 1,436 కి.మీ నడిచిన అభిమాని…

ధోనికి మన దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెపాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ అభిమాని ధోని కోసం 1436 కిలోమీటర్లు నడిచాడు. హర్యానాకు చెందిన అజయ్ గిల్ అనే ధోని అభిమాని 1436 కిలోమీటర్లు నడిచి రాంచీకి చేరుకుని తన ధోనీని కలిసాడు. అయితే గత మూడు నెలల్లో గిల్ రాంచీ ధోనిని చూసేందుకు కాలినడకన వెళ్లడం ఇది రెండోసారి. అతను చివరిసారి రాంచీకి వచ్చినప్పుడు అతనికి 16 రోజుల సమయం పడితే.. ఇప్పుడు 18 రోజులు పట్టింది. ఇక ధోని అజయ్ గిల్ ను తన ఫామ్‌హౌస్‌లోకి ఆహ్వానించి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అలాగే రాత్రి తన ఫామ్‌హౌస్‌ లో ఉండటానికి ఏర్పాటు కూడా చేసాడు. అలాగే గిల్ కోసం హర్యానాకు విమాన టిక్కెట్ ను కొని ఇచ్చాడు. అయితే ధోని అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత అజయ్ గిల్ క్రికెట్ ఆడటం మానేశాడు. కానీ మొదటివచ్చి ధోనిని కలిసిన తర్వాత అతను మళ్ళీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.

Exit mobile version