వన్డే వరల్డ్ కప్-2023లో మరో ఆసక్తికరపోరు జరుగుతుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో పసికూన నెదర్లాండ్స్ పోటీ పడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ పోరు జరుగుతుంది. అయితే, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, ఆసీస్ కు భారీ షాక్ తగిలింది. మార్క్ స్టొయినిస్ గాయంతో దూరం కాగా, అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక.. నెదర్లాండ్స్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగారు. ఇక, తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. శ్రీలంక, పాకిస్థాన్ లపై భారీ విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతుంది. సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు కంగారు జట్టు రెడీ అయింది.
Read Also: Amazon River: అమెజాన్ లో నీటి కరువు.. బయటపడిన పురాతన ముఖాలు
ఇక, ఆసీస్ టీమ్ లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా చెలరేగితే ఆస్ట్రేలియాను ఆపడం ఏ జట్టుకైనా కష్టమే అవుతుంది. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హెజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్ లతో ఆస్ట్రేలియా జట్టు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దనే విషయం ఆసీస్ టీమ్ కు తెలుసు. టోర్నీమెంట్ కి ముందు నెదర్లాండ్స్ చిన్న జట్టే.. కానీ సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చిన ఆ టీమ్ ను అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తేలేదు. ఇక, నెదర్లాండ్స్ జట్టులో అకార్మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్, లొగాన్ వాన్ బీక్ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.