ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్.. తనను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిన ఆ దేశంపై న్యాయ పోరాటం చేసినా జకోవిచ్‌కు ఊరట దక్కగ పోగా.. వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో.. రెండోసారి కూడా ఆయన వీసాను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన జకోవిచ్.. తన 21వ గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ, ఇప్పుడు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఆసీస్‌లోని స్కాట్ మోరిసన్ సర్కార్‌పై పరువు నష్టం దావా వేయాలనే నిర్ణయానికి వచ్చాడు.
తనను బలవంతంగా క్వారంటైన్‌కు తరలించారని.. 21వ గ్రాండ్‌స్లామ్ కల తీరకుండా అడ్డుకున్నారనే కారణాలు చూపుతూ.. ఏకంగా 32 కోట్ల రూపాయలకు దావా వేయాలని నిచ్చయించుకున్న ఆయన.. లాయర్ల నుంచి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. కాగా, గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్లిన జకోవిచ్‌ను కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదంటూ విమానాశ్రయంలోనే అడ్డుకోవడం రచ్చగా మారింది.. టోర్నీలో పాల్గొనేందుకు ఆయనకు నిర్వాహకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం బలవంతంగా క్వారంటైన్‌లో పెట్టింది.. దీనిపై న్యాయపోరాటం చేసినా.. జకోవిచ్ కు విజయం దక్కలేదు.. కానీ, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడంలో సఫలం అవుతారేమో చూడాలి. అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీతో పోలిస్తే మాత్రం.. రూ.32 కోట్లు చిన్న మొత్తమే.