NTV Telugu Site icon

Womens World Cup 2022: ఐసీసీ అత్యుత్తమ జట్టులో భారత మహిళలకు దక్కని చోటు

మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం.

ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం లభించింది. వెస్టిండీస్‌ నుంచి ఒకరికి, బంగ్లాదేశ్ నుంచి ఒకరికి ఈ జట్టులో చోటు దక్కింది. ఐసీసీ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమె ఈ మెగా టోర్నీలో 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఆస్ట్రేలియా నుంచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్‌ మూనీకు చోటు దక్కింది.

ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ టీమ్:
అలిస్సా హీలీ (వికెట్‌ కీపర్‌) (ఆస్ట్రేలియా), మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), చార్లీ డీన్ (ఇంగ్లండ్)

Icc Team