NTV Telugu Site icon

Cricket: వెస్టిండీస్ కొత్త కెప్టెన్‌గా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు

Nicholas Pooran

Nicholas Pooran

వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు కొత్త కెప్టెన్ దొరికాడు. కీరన్ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అప్పటి నుంచి వెస్టిండీస్ జట్టుకు సంబంధించి వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలో తెలియక విండీస్ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. అయితే తాజాగా వెస్టిండీస్ వన్డే, టీ20లకు కొత్త కెప్టెన్‌ను విండీస్ బోర్డు నియమించింది. కొత్త కెప్టెన్‌గా నికోలస్‌ పూరన్‌ను ఎంపిక చేసింది. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు నికోలస్ పూరన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

నికోలస్ పూరన్‌ 2016లో విండీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టీ 20ల్లో 1193 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు సాధించిన పూరన్‌.. టీ 20 క్రికెట్‌లో 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడిని మెగా వేలంలో రూ.10.75 కోట్లకు సన్‌రైజర్స్ టీమ్ కొనుగోలు చేసింది. తన రేటుకు న్యాయం చేస్తూ పూరన్ కీలక ఇన్నింగ్స్‌లతో సన్‌రైజర్స్‌కు విజయాలు కట్టబెడుతున్నాడు. కాగా అటు విండీస్ వైస్ కెప్టెన్‌గా హోప్‌ నియమితులయ్యాడు.

IPL 2022: ఈద్ సంబరాల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు.. వీడియో వైరల్