NTV Telugu Site icon

Neymar : ఆన్‌లైన్‌ పేకాటలో రూ. 9 కోట్లు మాయం.. బోరున ఏడ్చిన నెయ్‌మర్‌

Neymar

Neymar

బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ జూనియర్ నెయ్ మర్ ఆన్ లైన్ లో పోకర్( పేకాట) గేమ్ ఆడి 1 మిలియన్ యూరోలు ( భారత్ కరెన్సీలో దాదాపు. 9 కోట్లు ) పోగొట్టుకోవడం ఆసక్తి రేపింది. తన డబ్బు పోగొట్టుకోవడంతో నెయ్ మర్ కన్నీటిపర్యంతం అవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొడ కండరాల గాయంతో మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్న నెయ్ మర్ ఇంట్లోనే ఉంటుండడంతో పోకర్ గేమ్ ఆడుతూ బిజీగా గుడపుతున్నాడు.

Also Read : Icc World Cup 2023 : భారత్ లో ఆడే ప్రసక్తి లేదు.. లంకలో అయితే ఓకే!

ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్ లైన్ పోకర్ గేమ్ లో మెంబర్ గా ఉన్న నెయ్ మర్ బుధవారం రాత్రి గేమ్ ఆడాడు. అయితే గేమ్ లో భాగంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. అంతే తన డబ్బులు పోయాయంటూ లబోదిబో మన్న నెయ్ మర్ గుక్కపట్టి ఏడుస్తుండగా వెనకాల టైటానిక్ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. అయితే కాసేపటికే ఏడుపు మొహం నుంచి నవ్వు మొహంలోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also Read : NTR: అక్కడ షూటింగ్ మొదలుపెట్టాడు… ఇక్కడ హంగామా చేస్తున్నారు…

ఇదంతా కేవలం సరదా కోసమే అంటూ క్యాప్షన్ జత చేశాడు. పేకాటలో డబ్బులు పోవడం.. రావడం సహజం.. ఒకసారి పోతే మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత గేమ్ లో నెయ్ మర్ పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకున్నాడు. ఇక ఫిపా వరల్డ్ కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరమైన నెయ్ మర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీలతో కలిసి నెయ్ మర్ పారిస్ జెర్మెన్ (పీఎస్జీ ) క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.