Site icon NTV Telugu

New Zealand: న్యూజిలాండ్‌కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

Grand Homme

Grand Homme

New Zealand: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (36) బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని గ్రాండ్‌హోమ్ చెప్పాడు. వయసు పెరిగిన తన శరీరానికి శిక్షణ తీసుకోవడం కష్టమవుతుందని.. గాయాలు వేధిస్తున్నాయని అందువల్ల తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. జింబాబ్వేలో పుట్టిన గ్రాండ్ హోమ్ 2004లో అండర్-19 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే తరఫున ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు మకాం మార్చి ఆ దేశం తరఫున మొత్తం 29 టెస్టులు, 45 వన్డేలు, 41 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 2,679 పరుగులతో పాటు 91 వికెట్లు తీశాడు.

Read Also: AP Crime News: భర్త టిఫిన్ తెచ్చేలోపు భార్య మృతి.. అసలు ఏం జరిగిందంటే..?

కాగా గ్రాండ్‌హోమ్ రిటైర్మెంట్ విషయాన్ని స్వయంగా న్యూజిలాండ్ అపెక్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ కారణంగా గ్రాండ్‌ హోమ్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ హోమ్‌తో చర్చించిన తర్వాత అతడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు పేర్కొంది. కాగా తనకు ఫ్యామిలీతో టైం కేటాయించాలని ఉందని… క్రికెట్ తర్వాత తన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలనే విషయమై కూడా గత కొంతకాలంగా ఆలోచిస్తున్నట్లు గ్రాండ్ హోమ్ పేర్కొన్నాడు. తన కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. అటు గ్రాండ్‌హోమ్ రిటైర్మెంట్ కారణంగా ఓ మంచి ఆల్‌రౌండర్‌ను న్యూజిలాండ్ కోల్పోయిందని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.

Exit mobile version