New Zealand vs England: క్రికెట్ స్వరూపమే మారిపోయింది.. అసలైన ఆటగాడిని వెలికితీసే టెస్ట్‌లకు ఆదరణ తగ్గిందని.. ఆ తర్వాత వన్డే మ్యాచ్‌లకు కూడా గతంలో ఉన్న స్పందన లేదని.. ఇప్పుడంతా.. టీ-20 ఫార్మాట్ మ్యాచ్‌లదే హవా అంటున్నారు.. కానీ, కొన్ని ఘటనలు అనూహ్యంగా.. ఆ మ్యాచ్‌వైపు మళ్లేలా చేస్తుంటాయి.. అలాంటి ఉత్కంఠబరితమైన ఘటన ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది.. ఇదంతా ఎందకంటే.. టెస్ట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది.. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై సంచలన విక్టరీని కొట్టింది.. ఫాలో ఆన్‌ను అదిగమించి చరిత్ర సృష్టించింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
వెల్లింగ్టన్‌లో ఫాలో-ఆన్ చేయవలసి వచ్చినప్పటికీ సిరీస్‌ని డ్రా చేసుకోవడానికి న్యూజిలాండ్ మంగళవారం జరిగిన రెండవ-టెస్ట్ థ్రిల్లరన్‌లో కేవలం ఒక పరుగుతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌ను ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులకు ఆలౌటైంది. ఇక, దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచగలిగింది.. న్యూజిలాండ్ నిర్దేశించిన 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగు దగ్గర పెవిలియన్ చేరింది.. ఈ మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది.. ఒకసారి మ్యాచ్ ఇంగ్లండ్‌వైపు మొగ్గితే.. మరోసారి కివీస్ చేతిలోకి వచ్చినట్టు అనిపించింది.. చిట్ట చివరకు ఒకే ఒక్క పరుగుతో ఇంగ్లండ్ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.. ఈ విక్టరీతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసి పరువు కాపాడుకుంది.
ఒకే ఒక్క పరుగుతో విక్టరీ కొట్టి సంచలనం సృష్టించి.. కొత్త రికార్డునే సృష్టించారు.. న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో టెస్టు క్రికెట్‌లో విజయం సాధించిన రెండో జట్టుగా నిలిచింది న్యూజిలాండ్.. గతంలో 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని నమోదు చేసింది.. మళ్లీ ఇప్పుడు అంటే.. 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది..