వయస్సు పైబడినా.. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేకపోతున్నా.. విమర్శలు ఎదురైనా.. జట్టులోనే ఉండాలి.. క్రికెట్ ఆడుతూనే ఉండాలని భావించే క్రికెటర్లు ఎందరో ఉన్నారు.. ఫిట్‌నిస్ కోల్పోయి.. జట్టుకు దూరమైనా.. మళ్లీ వారి ప్రయత్నాలు సాగిస్తూ వస్తుంటారు.. అయితే, ఓ స్టార్ క్రికెట్ దానికి విరుద్ధం.. 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.. అతడే నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బెన్ కూపర్.. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశాడు.
Read Also: సర్కార్ సంచలన నిర్ణయం..! పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్..!
ఇక, దాదపాఉ నెదర్లాండ్స్‌కు పదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన బెన్ కూపర్.. ఆ జట్టులో స్టార్ ప్లేయర్‌గా పేరుపొందాడు.. 2013 ఆగస్టులో కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత మూడు నెలలకు ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా టి20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే, 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ.. చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి.. తాను మరికొన్ని రోజుల్లో నేను 30లోకి అడుగుపెట్టబోతున్నా.. పదేళ్ల పాటు సేవలందించా.. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు మాకు పెద్దగా అవకాశాలు రావు.. ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీల్లో మాత్రమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది.. వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ జరగబోతోంది. కానీ, నేను తప్పుకుంటేనే కొత్త ఆటగాళ్లకు అవకాశం వస్తుందని.. అందుకే విధి లేకనే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నానంటూ పేర్కొన్నాడు బెన్ కూపర్. కాగా, మొత్తం 58 టి20 మ్యాచ్‌ల్లో 1,239 పరుగులు సాధించిన ఈ క్రికెటర్. 13 వన్డేల్లో 187 పరుగులు చేశాడు. ఇక దేశవాలీ క్రికెట్ లో నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 451 పరుగులు.. 55 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 994 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.