Site icon NTV Telugu

Deepak Hooda: ఓ ఇంటివాడైన క్రికెటర్ దీపక్.. ఫొటోలు షేర్

Cricketerdeepakhooda

Cricketerdeepakhooda

టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఈనెల 15న ఓ ఇంటివాడయ్యాడు. దాదాపు నాలుగు రోజుల తర్వాత శుక్రవారం (19-07-2024) తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశాడు. బంధుమిత్రలు, శ్రేయోభిలాషుల మధ్యలో వివాహం జరిగినట్లుగా పేర్కొన్నాడు. కానీ తన భార్య పేరును మాత్రం బయటపెట్టలేదు. ఫొటోల్లో మాత్రం కొత్త జంట సంతోషంగా కనిపించారు. రెడ్ కలర్ డ్రస్‌లో నవదంపతులిద్దరూ మెరిసిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరి వివాహం జరిగింది.

29 ఏళ్ల దీపక్ హుడా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వాడు. ప్రేమికురాలిని వివాహం చేసుకునేందుకు దాదాపు తొమ్మిదేళ్లు నిరీక్షించాడు. తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత తమ కల నెరవేరిందని దీపక్ పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశీర్వాదాలతో మా హృదయాలు నిండిపోయాయని హుడా వెల్లడించాడు.

ఇక దీపక్ హుడా.. భారత్ తరఫున 21 టీ20లు, 10 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో ఎల్‌ఎస్‌జీలో ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. మొత్తానికి జూలై 15న ప్రేమ వివాహంతో ఓ ఇంటివాడయ్యాడు. హిమాచల్ అమ్మాయిను తన ఇంటిలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపాడు.

Exit mobile version