పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ సీజన్ 2022లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి విజయం పతాకం ఎగురవేయాలని ముంబై ఇండియన్స్ జట్టు ఉవ్విల్లురుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 28 సార్లు పోటీ జరగ్గా.. ముంబై 15.. పంజాబ్ 13సార్లు నెగ్గింది. 2019 నుంచి చూసుకుంటే ఇరుజట్లు ఆరుసార్లు పోటీ పడితే చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ మరో ఫోర్ బాదితే ఐపీఎల్‌లో 500 ఫోర్లు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.
