Site icon NTV Telugu

IPL 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీ

Mi Vs Pk

Mi Vs Pk

ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే ల మధ్య జరిగిన పోరుతో ఆరెంజ్‌ ఆర్మీ సత్తా చాటి విజయం కేతనం ఎగురవేసింది. అయితే రాత్రి 7.30 గంటలకు ఆర్‌సీబీ, ముంబాయి ఇండియన్స్‌ మధ్య పోరు మొదలైంది. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇంకా బోణీ కొట్టకపోవడంతో ఈ మ్యాచ్‌లోనైనా గెలించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్‌సీబీ మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచి జోరుమిందుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 16, ఇషాన్‌ కిషన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Exit mobile version