Site icon NTV Telugu

SRH vs MI: సోసోగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Mi 10 Overs Score

Mi 10 Overs Score

Mumbai Indians Scored 80 Runs In First 10 Overs Against SRH: ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంపిక చేసుకోవడంతో.. ముంబై జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే.. ఆశించిన స్థాయిలో భారీ పరుగులైతే రావడం లేదు. తొలి 10 ఓవర్లలో ముంబై జట్టు ఒక వికెట్ నష్టానికి (8.0 రన్ రేట్‌తో) 80 పరుగులు చేసింది. తొలుత నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత కాస్త జోష్ పెంచారు. పవర్ ప్లేలో వీలైనన్ని బౌండరీలు బాదేందుకు ప్రయత్నించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) అయితే.. సాధ్యమైనంతవరకూ పరుగుల వర్షం కురిపించేందుకు ట్రై చేశాడు. కానీ.. అదే జోరులో అతడు ఔట్ అయ్యాడు. నటరాజన్ బౌలింగ్ బంతిని లెగ్ సైడ్ కొట్టబోగా.. అది బ్యాట్ అంచుల్లో తగిలి గాల్లో ఎగిరింది. దీంతో.. ఆ బంతి నేరుగా మార్ర్కమ్ చేతుల్లో చిక్కింది.

Chennai Crime News: భర్త అనుమానం.. 29 రోజుల పసికందు హత్య

రోహిత్ ఔట్ అయిన అనంతరం కెమరూన్ గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. వచ్చి రాగానే భారీ షాట్లు కొట్టాలని ట్రై చేశాడు కానీ, అతనికి సరైన బంతులు దొరకలేదు. సన్‌రైజర్స్ బౌలర్లు కన్ఫ్యూజ్ అయ్యే రీతిలో బౌలింగ్ వేస్తున్నారు. అటు.. ఇషాన్ కిషన్ కూడా ఆచితూచి ఆడుతున్నాడు. తనకు అనుకూలమైన బంతులు దొరికినప్పుడు షాట్లు బాదుతూనే, నిదానంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్తే.. ఔటయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, జాగ్రత్తగా రాణిస్తున్నాడు. ఇక సన్‌రైజర్స్ బౌలర్ల విషయానికొస్తే.. టి. నటరాజన్ ఒక్కడే ఒక వికెట్ తీసుకున్నాడు. అది కూడా రోహిత్ శర్మది. మిగిలిన బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు.

Exit mobile version