NTV Telugu Site icon

MS Dhoni: ధోనీకి మోకాలి శస్త్రచికిత్స.. ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Dhoni

Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మోకాళ్ల నొప్పులకు ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. త‌న సొంతూరు రాంచీకి 70 కిలోమీట‌ర్ల దూరంలో ఓ చెట్టు కింద కూర్చుని వైద్యం చేసే వంద‌న్ సింగ్ ఖేర్వార్ వ‌ద్ద ధోనీ చికిత్స పొందుతున్నాడు. క్యాల్షియం లోపం కార‌ణంగా ధోనీకి మోకాళ్ల నొప్పులు వచ్చినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే ఎంతమంది వైద్యం చేసినా ధోనీకి ఉపశమనం లభించలేదు. అయితే తన తల్లిదండ్రుల సూచనతో చెట్టుకింద వైద్యం చేసే వందన్ సింగ్ వద్దకు వెళ్లగా ధోనీ ఎవరో తెలియకుండానే ఆయన వైద్యం చేశారట. అయితే తనకు వైద్యం చేసిన వందన్ సింగ్‌కు ధోనీ ఎంత చెల్లించాడో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

Read Also: Electric Scooters: నాలుగో స్థానానికి ఓలా ఢమాల్.. ఫస్ట్ ప్లేస్‌లో?

ధోనీకి తనకు మూలికా వైద్యం చేస్తున్న వందన్ సింగ్‌కు ఒక్కో డోస్‌కు రూ.40 మాత్రమే చెల్లిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో రూ.20 కన్సల్టేషన్ ఫీజు కాగా మరో రూ.20 మెడిసిన్ ఖర్చు అని తెలుస్తోంది. అయితే తన వద్ద చికిత్స కోసం ధోనీ ఓ సామాన్యుడిలా తరచూ వస్తుంటాడని వందన్ సింగ్ ఖర్వార్ వెల్లడించారు. ఓ సెలెబ్రిటీ అనే గర్వం ధోనీలో కొంచెం కూడా కనిపించదని తెలిపారు. ప్రతి నాలుగు రోజులకోసారి మోకాలి నొప్పికి చికిత్స కోసం ధోనీ తన వద్దకు వస్తుంటాడని వివరించారు. ధోనీ వచ్చాడనే విషయం తెలిసి వెంటనే గ్రామస్తులు తన ఆసుపత్రికి చేరుకుంటారని, వారిని నిరాశకు గురి చేయకుండా ధోనీ అందరితోనూ సెల్ఫీలు దిగుతుంటాడని వందన్ సింగ్ పేర్కొన్నారు. కాగా మోకాలి నొప్పి మినహా ధోనీ ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని, అతడు ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదని సమాచారం అందుతోంది.

Show comments