భారత్- బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అందుకోసం భారత ఆటగాళ్లు నెట్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత జట్టుతో చేరిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే, హార్దిక్ బౌలింగ్ తీరుపై కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అతని బౌలింగ్‌లో చేయవలసిన దిద్దుబాట్లపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
హార్దిక్ స్టంప్‌లకు చాలా దగ్గరగా బంతులు విసరడం బౌలింగ్ కోచ్ మోర్కెల్‌కి నచ్చలేదని, ఈ శైలిని కొంచెం మార్చుకుంటే బాగుటుందని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు.. రన్-అప్‌పై హార్ధిక్ కీలక సూచనలు చేశాడు. చేతి నుంచి బాల్ విడుదల చేసే పాయింట్‌పై కూడా మోర్కెల్-హార్దిక్ చర్చించినట్టు సమాచారం. హార్దిక్ తన బౌలింగ్ మెరుగ్గా ఉండేలా తన అలవాటును మెరుగుపరచుకోవాలని మోర్కెల్ చెప్పినట్లు సమాచారం.
Amazon Sale: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీగా తగ్గింపు.. సగం ధరకే కొనేయచ్చు
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీమిండియా ఫోకస్ రాబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఉంది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో.. టీ20 సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
3 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, రానా, మయాంక్ యాదవ్.