బెస్ట్ టీ20 క్రికెటర్ 2021 అవార్డుకు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.. పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. కాగా, 2021లో టీ-20ల్లో చెలిరేగి పోయాడు రిజ్వాన్.. 29 మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ ప్లేయర్.. 73.66 సగటుతో 1,326 పరుగులు చేశాడు.. స్ట్రయిక్ రేట్ 134.89 సాధించాడు.. బ్యాటింగ్‌లోనే కాదు.. మరోవైపు వికెట్ కీపర్‌గానూ సత్తా చాటాడు రిజ్వాన్.. పాక్ జట్టు సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషించాడు.. గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన మూడో వ్యక్తిగా రికార్డుకెక్కాడు.. ఒక, కెరీర్‌లో ఇప్పటివరకు 19 టెస్ట్‌లు, 41 వన్డేలు, 55 టీ20లు ఆడిన రిజ్వాన్.. 4 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలతో 3500కు పైగా పరుగులు సాధించాడు.
పాక్ క్రికెటర్‌కు టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు..
