ఈ ఏడాది జరుగుతున్న ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా వచ్చేసిన జట్లలో ఆఫ్ఘనిస్థాన్ ఒక్కటి అనే విషయం తెలిసిందే. అయితే ఈ జట్టును ప్రకటించిన సమయంలో దానికి కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ మధ్యలో ఆ బాధ్యతలు వదిలేశాడు. దాంతో కెప్టెన్ గా మొహమ్మద్ నబీ ఎంపికయ్యాడు. ఇక నిన్న ఈ జట్టు స్కోట్లాండ్ ను చిత్తుగా ఓడించి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ కు వచ్చిన నబీ తన మాటలతో అందరిని నవించాడు. అయితే అక్కడికి వచ్చి కూర్చొన తర్వాత ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన నబీ.. నిజంగా ఇది చాలా కష్టమైనా పని అన్నాడు. ఆ తర్వాత పక్కన వారిని ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అని అడిగిన నబీ… ఆ తర్వాత సరదాగా నా ఇంగ్లిష్ 5 నిమిషాల్లో అయిపోదని అన్నాడు. దాంతో అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
5 నిమిషాల్లో నా ఇంగ్లిష్ అయిపోతది : నబీ
