NTV Telugu Site icon

సచిన్ రికార్డుకు దగ్గరగా మిథాలీ రాజ్.. బద్దలు ఖాయం!

టీమ్‌ ఇండియా మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసిన మిథాలీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోంది. కాగా త్వరలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (22 ఏళ్ల, 91 రోజులు) క్రికెట్‌ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్‌ పేరుతో ఉంది. అయితే మిథాలీ మరో మూడు నెలల పాటు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును బ్రేక్ చేసి.. అరుదైన ఘనత సృష్టించనున్నది. అంతర్జాతీయ మహిళల మ్యాచుల్లో ఇప్పటి వరకు అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌ కూడా మిథాలీనే కావడం విశేషం.. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ లో రాణిస్తోంది.