Site icon NTV Telugu

IPL 2022 Auction: దుమ్ములేపిన ఇషాన్‌ కిషన్‌.. రూ.15.25 కోట్లు..

ఐపీఎల్‌ 2022 వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కోసం తీవ్రమైన పోటి నెలకొంది.. దీంతో.. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు ఈ యువ క్రికెటర్‌.. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌.. మళ్లీ వేలంలో పోటీ పడి దక్కించుకుంది. ఇక, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కూడా ఇషాన్‌ కోసం గట్టి ప్రయత్నమే చేసింది.. దీంతో వేలంలో హోరాహోరీ నెలకొంది. డబ్బులు ఖర్చు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా ఓ దశలో ఇషాన్‌పై రూ.14 కోట్లు కూడా పెట్టేందుకు రెడీ అయ్యింది.. కానీ, ముంబై ఇండియన్స్ అందరికంటే ఎక్కువగా రూ.15.25 కోట్లకు ఇషాన్ ను దక్కించుకుంది. దీంతో.. ఇవాళ జరిగిన తొలి రోజు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఇషాన్‌ కిషన్‌..

Read Also: KCR: రాహుల్‌పై బీజేపీ సీఎం వ్యాఖ్యలు.. నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి..!

ఇక, అంతకు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 12. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు), స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకున్న విషయం విదితమే.

Exit mobile version