Site icon NTV Telugu

Mayank Agarwal: పుత్రోత్సాహంతో మురిసిపోతున్న టీమిండియా ఓపెనర్

Mayank Agarwal

Mayank Agarwal

Mayank Agarwal: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మయాంక్ అగర్వాల్ భార్య ఆషిదా సూద్ తాజాగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మా గుండెల నిండా ప్రేమతో అయాన్ష్‌ను పరిచయం చేస్తున్నాం. ఇతను దేవుడి ఇచ్చిన ఓ బహుమతి’’ అని పేర్కొన్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆశీస్సులు అందజేస్తున్నారు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా తన సహచరుడికి శుభాకాంక్షలు తెలిపాడు. మయాంక్, ఆషిదా దంపతులకు అయాన్ష్ ఈనెల 8న జన్మించాడు.

Read Also: Himachal Pradesh: హిమాచల్‌ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సుఖు ప్రమాణం

మయాంక్ అగర్వాల్, ఆషిత దంపతులు జూన్ 4, 2018న పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు ఈ జంట ఏడేళ్ల పాటు డేటింగ్ చేసింది. బెంగళూరులో వారి తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో ఈ జంట తొలిసారిగా కలుసుకున్నారు. అయితే మొదటి చూపులోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో మయాంక్ అగర్వాల్ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చూస్తున్నాడు. ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన మయాంక్ అగర్వాల్‌ను ఇటీవలే ఫ్రాంచైజీ విడుదల చేసింది. మయాంక్ తన బేస్ ధరను రూ.కోటిగా నిర్ణయించాడు. గత ఏడాది రూ.12 కోట్లకు మయాంక్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే అతడు ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.

Exit mobile version