క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా టోర్నీ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. 14 సీజన్‌లలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల వివరాలు మీకు తెలుసా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఓ ఆటగాడు 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అతడు ఎవరో కాదు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఐపీఎల్‌లో అన్నీ సీజన్‌లలో ఆర్సీబీకే డివిలియర్స్ ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన అతడు 5,162 పరుగులు చేశాడు. సగటు 39గా నమోదైంది. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 133.
ఈ జాబితాలో రెండో స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో ఇద్దరు ఆటగాళ్లు కొనసాగుతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, డేవిడ్ వార్నర్ ఇద్దరూ 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు.
