NTV Telugu Site icon

IPL 2022: లక్నో ఓపెనర్ల వీర విహారం.. డికాక్ భారీ సెంచరీ

Lucknow Super Gaints

Lucknow Super Gaints

ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లపాటు వికెట్ పడకుండా ఆడి 210 పరుగులు చేశారు. ఓపెనర్లు డికాక్(70 బంతుల్లో 140 నాటౌట్), కేఎల్ రాహుల్(51 బంతుల్లో 68 నాటౌట్) వీర విహారం చేశారు. అంతేకాకుండా వీళ్లిద్దరూ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు.

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బెయిర్‌స్టో, వార్నర్ (185 పరుగులు) పేరిట ఉన్న ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ రికార్డును డికాక్-కేఎల్ రాహుల్ జంట చెరిపేసింది. డికాక్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు.. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వీళ్లిద్దరి జోరుకు కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. కాగా కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో 211 పరుగులు చేయాల్సి ఉంది.