Lucknow Super Giants Won The Match by 56 Runs On Punjab Kings: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. లక్నో నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఛేధించలేకపోయింది. 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. లక్నో 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్యం పెద్దది కావడం.. ఆ ఒత్తిడిలోనే పంజాబ్ మొదట్లో రెండు వికెట్లు కోల్పోవడం.. అథర్వా మినహాయించి మరే ఇతర బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోవడం.. పంజాబ్ జట్టు ఓటమికి కారణాలు అయ్యాయి. ఈ విజయంతో లక్నో జట్టు ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. పంజాబ్ జట్టు ఆరవ స్థానంలోనే ఉండిపోయింది.
Cruise Ships: ప్రపంచంలో 10 అతిపెద్ద క్రూజ్ షిప్స్
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. కైల్ మేయర్స్ (24 బంతుల్లో 54), బదోని (24 బంతుల్లో 43), స్టోయినిస్ (40 బంతుల్లో 72), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. లక్నో జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే (12) పరుగులతో నిరాశపరచగా.. మిగతా బ్యాటర్లు మాత్రం పరుగుల సునామీ సృష్టించారు. బంతుల్ని ఏమాత్రం వృధా చేయకుండా బౌండరీల వర్షం కురిపించారు. ఇక 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. 19.5 ఓవర్లలో 201 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పంజాబ్ మొదట్లో ఇన్నింగ్స్‌ని నిదానంగా ప్రారంభించడం.. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో.. పంజాబ్ డీలా పడింది. అయితే.. అథర్వా, సికందర్ రాజా మాత్రం అద్భుతంగా ఆడారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Off The Record: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో మళ్లీ టికెట్ దక్కేది ఎవరికి?
ఆ ఇద్దరు ఆటగాళ్లు ఔటవ్వగానే.. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టడం మొదలుపెట్టారు. అయితే.. వచ్చిన ప్రతి ఒక్కరూ కసిగానే బ్యాటింగ్ చేశారు. తమవంతు పరుగులు చేసి.. 200 పరుగుల మైలురాయిని అందుకునేలా చేశారు. మరీ దారుణంగా ఓడిపోకుండా.. పోరాడారు. చివర్లో మాత్రం వరుసగా వికెట్లు పడ్డాయి. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా.. నవీన్-ఉల్-హక్ మూడు, రవి బిష్ణోయ్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టారు.
