NTV Telugu Site icon

LSG vs PBKS: ముగిసిన లక్నో బ్యాటింగ్.. పంజాబ్ ముందు 160 లక్ష్యం

Lsg Innings

Lsg Innings

Lucknow Super Giants Scored 159 In 20 Overs Against Punjab Kings: ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 74) ఒక్కడే అర్థశతకంతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. కాస్తో కూస్తో కైల్ మేయర్స్ (23 బంతుల్లో 29) పర్వాలేదనిపించాడంతే! మిగతావాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఆకాశమే హద్దుగా చెలరేగిన విధ్వంసకర ఆటగాడైన నికోలస్ పూరన్ ఈసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ EOI మరో ఐదురోజులు పొడిగింపు

మొదట బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్.. నిదానంగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. పవర్ ప్లే ఉంది కదా అని విరగబడి ఆడలేదు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. కైల్ మేయర్స్ ఔటయ్యాక వచ్చిన దీపక్ హుడా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. కేవలం 2 పరుగులే చేసి, అతడు పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యాతో కలిసి రాహుల్ తన జట్టుని ముందుకు నడిపించాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇక అప్పటినుంచి బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియట్ బాట పడుతూ వచ్చారు. చివర్లో బౌండరీల వర్షం కురిపిస్తారనుకుంటే, అందుకు భిన్నంగా లక్నో జట్టు వికెట్లు కోల్పోయింది. తద్వారా లక్నో జట్టు 159 పరుగులకే పరిమితం అయ్యింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబాడ రెండు, అర్ష్‌దీప్ – బ్రార్ – రజా తలా వికెట్ తీసుకున్నారు. మరి.. 160 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేధిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే!

IPL 2023 RCB Vs DC: ఆర్సీబీ బౌలర్ల హవా..ఢిల్లీపై బెంగళూర్ ఘన విజయం..