IPL 2022 : తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో..

Lsg Vs Pbks

Lsg Vs Pbks

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ రోజు ఎంసీఏ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఢీ కొట్టనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిపొందింది లక్నో సూపర్‌ జెయింట్స్‌.

అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. టాసో ఓడి బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆదిలోనే తొలి వికెట్‌ చేజార్చుకుంది. ఆరు పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ రబాడ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.