NTV Telugu Site icon

Common Wealth Games 2022: లాంగ్ జంప్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్

Common Wealth Games

Common Wealth Games

Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు క్వాలిఫికేషన్‌ రౌండ్ల నుంచి ఫైనల్‌కు చేరుకున్నారు. భారత అథ్లెట్లు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. తన గ్రూప్ ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో మురళీ శ్రీశంకర్ తన మొదటి ప్రయత్నంలో 8.05 మీటర్లు దూకాడు. భారత్‌ ఫైనల్‌ చేరేందుకు ఇదొక్కటే కీలకంగా నిలిచింది. అతను గెట్-గో నుండి లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అతనని మరెవరు అధిగమించలేకపోయారు. 7.90 మీటర్ల బెస్ట్ జంప్‌తో బహామాస్‌కు చెందిన లక్వాన్ నైరన్ రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జోవాన్ వాన్ వురెన్ 7.87 మీటర్ల బెస్ట్ జంప్‌తో మూడో స్థానంలో నిలిచాడు. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది మంది అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

Asia Cup 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఆసియా కప్ షెడ్యూల్ విడుదల

గ్రూప్ బీ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అనీస్ తన మొదటి ప్రయత్నంలోనే 7.49 మీటర్ల జంప్ చేసి శుభారంభం చేశాడు. అతను తన రెండవ ప్రయత్నంలో 7.68 మీటర్లు, తన మూడవ ప్రయత్నంలో మరో 7.49 మీటర్లు దూకి, అత్యుత్తమంగా 7.68 మీటర్లతో ముగించాడు. అతను తన మొదటి ప్రయత్నంలో 7.83 మీటర్ల బెస్ట్ జంప్ చేసిన గయానాకు చెందిన ఇమాన్యుయెల్ ఆర్చిబాల్డ్ తర్వాత తన గ్రూప్‌లో మూడవ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టోఫర్ మిట్రెవ్‌స్కీ 7.76 మీటర్లు దూకాడు. అనీస్ 8వ అత్యుత్తమ జంపర్‌గా ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొత్తం 12 మంది అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.