NTV Telugu Site icon

Sunil Chhetri: భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి..

Sc

Sc

Sunil Chhetri Retirement: ప్రపంచం లో అత్యధికంగా పాపులర్ అయిన ఫుట్ బాల్ భారత దేశంలో పెద్దగా ఆదరణ చూరగొనలేకపోయింది. కానీ ఫుట్ బాల్ ప్రపంచం లో ఈ భారతీయుడి పేరు తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏకంగా అత్యధిక గోల్స్ చేసిన ఫుట్ బాల్ క్రీడాకారులలో క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్‌ మెస్సి (106) తరువాత స్తానం ఇతని పేరు ఉంది అంటే అది భారత దేశానికే గర్వకారణం అంతటి గణతః సాధించిన టీమ్ ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి నేడు అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

39 ఏళ్ల ఈ ఇండియన్ లెజెండరీ ప్లేయర్.. గురువారం (మే 16) ఓ వీడియో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. జూన్ 6వ తేదీన కువైట్ తో ఇండియా ఆడబోయే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ తన చివరిదని ప్రకటించాడు. భావోద్వేగంతో ఇండియా తరఫున తాను ఆడిన తొలి మ్యాచ్ ను ఎప్పటికీ మరచిపోలేనని ఈ వీడియోలో సునీల్ ఛెత్రి చెప్పాడు. తొలి మ్యాచ్ లోనే తాను గోల్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. తాను తొలిసారి ఇండియా జెర్సీ వేసుకునే ముందు తెలియకుండానే తాను దానిపై పర్ఫ్యూమ్ కొట్టానని కూడా చెప్పాడు. ఇప్పుడు చివరి మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా కెరీర్లో ప్రతి క్షణం గుర్తుకు వస్తోందని తెలిపాడు.

Also Read; Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..

“ఈ మ్యాచ్ నాకు చివరిది అని నాకు నేను చెప్పుకున్న సమయంలో ప్రతి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మ్యాచ్, ఆ కోచ్, ఈ మ్యాచ్, ఈ టీమ్.. ఇలా అన్నీ గుర్తుకు రావడం వింతగా అనిపించింది. అన్నీ గుర్తుకు వచ్చాయి. దీంతో నేను తుది నిర్ణయం తీసుకున్నాను” అని ఆ వీడియోలో సునీల్ ఛెత్రీ చెప్పాడు.

మొత్తంగా ఇప్పటి వరకూ సునీల్ ఛెత్రీ 150 అంతర్జాతీయ మ్యాచ్ లలో 94 గోల్స్ చేశాడు. అతడు జట్టులో ఉండగానే ఇండియా నెహ్రూ కప్ ను మూడుసార్లు, సాఫ్ ఛాంపియన్షిప్ మూడుసార్లు గెలిచింది. ఇక 2008లో ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ ఇండియా గెలవడంలోనూ ఛెత్రీదే కీలకపాత్ర. ఇతని సేవలకు మెచ్చి భారత సర్కారు అర్జున అవార్డు (2011), పద్మశ్రీ (2019), రాజీవ్ ఖేల్ రత్న (2021) అవార్డులు ఇచ్చి సత్కరించింది.

19ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఫుట్ బాల్ ఆటగాడిగా ఎన్నో మైలు రాళ్లు అందుకుని భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ తరువాత చేయబోయే ప్రతి పనిలో విజయం సాధించాలి అని కోరుకుంటూన్నాం.