NTV Telugu Site icon

Lakshya Sen: నెరవేరని లక్ష్యసేన్‌ కల..!

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. 10-21, 15-21 తేడాతో టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అక్సెల్‌సెన్‌కు దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. ఇటీవల జరగిన జర్మనీ ఓపెన్‌లో ఈ డెన్మార్క్‌ షట్లర్‌ను మట్టికరిపించిన సేన్‌.. మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆందరూ ఊహించారు. కానీ, అక్సెల్‌సన్‌ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ డ్రాప్‌ షాట్లు, పదునైన స్మాష్‌లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌కు దీటైన పోటీనిచ్చే క్రమంలో సేన్‌ తడబడ్డాడు.

Read Also: AP Assembly: స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ..

తొలి గేమ్‌లో 0-6తో వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్‌.. మళ్లీ కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత పుంజుకున్నట్లు కనిపించినా.. అక్సెల్‌సన్‌ ఏమాత్రం అవకాశమివ్వలేదు. వరుస పాయింట్లతో ముందంజ వేశాడు. అదే జోరులో తొలి గేమ్‌ను 21-10ను కైవసం చేసుకున్నాడు. అయితే, కీలకమైన రెండో గేమ్‌లో విక్టర్‌కు 4-4తో సమాధానమిచ్చిన లక్ష్యసేన్‌.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వరుసగా నాలుగు పాయింట్లతో అక్సెల్‌సన్‌ తన ఆధిక్యాన్ని 8-4కు పెంచుకున్నాడు. ఆతర్వాత కూడా ఏమాత్రం వెనుకకు తగ్గని అక్సెల్‌సెన్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.