Site icon NTV Telugu

Krunal Pandya: తండ్రి అయిన భారత ఆల్‌రౌండర్.. ఆనందంలో మునిగితేలుతున్న క్రికెటర్

Krunal Pandya

Krunal Pandya

Krunal Pandya: భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతని భార్య పంఖూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తన ట్విటర్‌లో ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక తమ కొడుకు పేరును కవిర్ కృనాల్ పాండ్యా’ అని పెట్టినట్లు తెలిపాడు. ఆదివారం తన ట్విటర్‌లో తన కొడుకు ఫొటోతో పాటు పేరును కూడా ప్రకటించాడు. ఈ ఫొటోలో భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా, ఆయన భార్య పంఖురి తమ బిడ్డను చేతుల్లో పట్టుకుంది. “కవిర్ కృనాల్ పాండ్యా” అని పేరుతో హార్ట్ ఎమోజినీ క్యాప్షన్‌లో రాశాడు. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా సోదరుడు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అన్న కృనాల్ పాండ్యాకు శుభాకాంక్షలు తెలిపాడు. కేఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. మీరు కూడా ట్రై చేస్తారా..?

డిసెంబర్ 2017లో పంఖురి శర్మతో క్రునాల్ వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. ఇండియా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల సమయంలో క్రునాల్‌ను ఉత్సాహపరుస్తూ పంఖురి తరచుగా స్టేడియంలో కనిపించారు. మరోవైపు, కృనాల్ చివరిసారిగా జూలై 2021లో శ్రీలంకకు వ్యతిరేకంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఆల్‌రౌండర్ 2018లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన తర్వాత 5 వన్డేలు, 19 టీ-20లు ఆడాడు. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి అరంగేట్రం చేశాజు. ఐపీఎల్ 2022లో జట్టులోని టాప్ ఫోర్ ఫినిషింగ్‌లో కీలక పాత్ర పోషించాడు.

Exit mobile version