Site icon NTV Telugu

KKR vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న కేకేఆర్

Srh Vs Kkr

Srh Vs Kkr

Kolkata Knight Riders Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 19వ మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన కేకేఆర్.. అందులో రెండు విజయాలు సాధించి మంచి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి, విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అటు.. ఎస్ఆర్‌హెచ్ తొలుత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన, మూడో మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. పంజాబ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌ల్లోనూ అదే జోష్ కొనసాగించి, వరుస విజయాలతో దూసుకెళ్లాలని కసిగా ఉంది.

Arvind Kejriwal: చదువంటే ఇష్టం లేని.. దేశ వ్యతిరేక శక్తులు సిసోడియాను జైలుకు పంపాయి..

ఇప్పటికే కెప్టెన్ మార్ర్కమ్ సైతం తమ జట్టు చాలా పటిష్టంగా ఉందని, తమ వద్ద డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారని, తమకేం భయం లేదని ఆత్మవిశ్వాసంతో చెప్పడాన్ని బట్టి చూస్తుంటే.. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి.. కేకేఆర్‌తో తలపడుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఆధిపత్యం చెలాయిస్తుందా? లేక ఓటమిపాలవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ! మరో విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఓవరాల్‌గా 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అయితే.. 15 విజయాలతో కేకేఆర్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఎస్ఆర్‌హెచ్ మాత్రం కేవలం 8 సార్లు మాత్రమే కేకేఆర్‌పై విజయం సాధించింది. దీంతో.. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పట్లాగే కేకేఆర్ తన డామినెన్స్ చూపిస్తుందా? లేదా ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్‌తో మాయ చేస్తుందా? అని ఆతృతగా ఉన్నారు.

Exit mobile version