Site icon NTV Telugu

IPL 2022: తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఓటమి

ఐపీఎల్ 15వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ధోనీ హాఫ్ సెంచరీ (50 నాటౌట్)తో రాణించగా మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు.

అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోది దిగగా.. ఓపెనర్ రహానె (44), వెంకటేష్ అయ్యర్ (16) శుభారంభం ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ అవుటైన తర్వాత నితీష్ రానా (21), బిల్లింగ్స్ (25) తలో చెయ్యి వేశారు. నాలుగు వికెట్లు కోల్పోయినా లక్ష్యం తక్కువగా ఉండటంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (20 నాటౌట్) తన జట్టును 18.3 ఓవర్లలో విజయ తీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో బ్రావోకు 3 వికెట్లు దక్కాయి. చెన్నై బౌలింగ్ వచ్చే మ్యాచ్‌లలో మారకపోతే ఈ టోర్నీలో వారి ప్రయాణం కష్టమే.

https://ntvtelugu.com/bangladesh-cricket-team-creates-history-in-south-africa/
Exit mobile version