ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తమ జట్టు ఎంపికలో కోచ్‌తో పాటు సీఈవో వెంకీ కూడా పాల్గొంటారంటూ వ్యాఖ్యానించాడు. 11 మంది సభ్యుల తుది జట్టులో నీకు చోటు లేదంటూ మరో ఆటగాడికి చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు శ్రేయస్ అయ్యర్ గుర్తుచేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జట్టు ఎంపికలో సీఈవో పాత్ర ఏంటంటూ నెటిజన్‌లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు జట్టు విషయాల గురించి తాము కోచ్‌లతో చర్చిస్తుంటామని.. అయితే సీఈవో సైతం జట్టు ఎంపికలో పాలుపంచుకుంటారని శ్రేయస్ అయ్యర్ వివరించాడు. ముఖ్యంగా బ్రెండన్ మెక్ కల్లమ్ ముఖ్యపాత్ర పోషిస్తాడని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని తెలిపాడు. మైదానంలో ఒకరికొకరు సహకారంతో పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే కెప్టెన్‌గా తాను గర్వపడుతున్నానని చెప్పాడు.
