Site icon NTV Telugu

IPL 2022: కేఎల్ రాహుల్‌కు షాక్.. రూ.12 లక్షలు జరిమానా

Kl Rahul

Kl Rahul

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షలు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేట్ కారణంగా కేఎల్ రాహుల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేసిన రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా రెండో శతకాన్ని నమోదు చేసిన రాహుల్‌.. ఐపీఎల్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ ద్వారా రాహుల్‌ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (పంజాబ్‌పై 2 సెంచరీలు), విరాట్‌ కోహ్లి (గుజరాత్‌ లయన్స్‌పై 2 సెంచరీలు), డేవిడ్‌ వార్నర్‌ (కోల్‌కతాపై 2 సెంచరీలు) సరసన చేరాడు.

IPL 2022: ఢిల్లీపై గెలుపు.. బెంగళూరు ఖాతాలో నాలుగో విజయం

Exit mobile version