NTV Telugu Site icon

KL Rahul – Athiya: కేఎల్ రాహుల్, అథియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఈ నెల్లోనే!

Kl Rahul Athiya Marriage

Kl Rahul Athiya Marriage

KL Rahul Athiya Shetty To Tie The Knot On This Date: బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టితో క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! తమ ప్రేమ వ్యవహారాన్ని అందరిలా రహస్యంగా ఉంచకుండా, బాహాటంగానే రివీల్ చేశారు. ఫ్రీ సమయం దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడానికి సిద్ధమవుతున్నారు. అవును.. ఇన్నాళ్లు అదిగో, ఇదిగో అంటూ తమ పెళ్లిని నాన్చుకుంటూ వచ్చిన ఈ జంట, చివరికి ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఎప్పుడో తెలుసా..? ఈ నెల 23వ తేదీనే!

Plastic Waste: ఎక్కడ చూసినా చెత్తే.. ఇలాగే ఉంటే మన బతుకులు అంతే?

బాలీవుడ్ సమాచారం ప్రకారం.. రాహుల్, అథియాల పెళ్లి ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉంటుంది. ముంబై సమీప ప్రాంతమైన ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసంలోనే వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు అథిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఆల్రెడీ పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి హాజరు కానున్న అథితుల జాబితా సైతం రెడీ అయ్యింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలతో పాటు మరికొందరు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.

Hindu Temple Attacked: హిందూ దేవాలయంపై దాడి.. ఖలిస్తాన్ మద్దతుదారుల దుశ్చర్య

కాగా.. కేఎల్ రాహుల్, అథియా శెట్టి గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. గతేడాది అథియా పుట్టినరోజు సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌పై వీళ్లు అధికారిక ప్రకటన చేశారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ నెల 23న పెళ్లిపీటలెక్కుతున్నారు.

Show comments