Site icon NTV Telugu

IPL 2022: మా ఓటమికి ఆ ఒక్క తప్పిదమే కారణం: శ్రేయాస్ అయ్యర్

బుధవారం రాత్రి బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. సాధించింది తక్కువ పరుగులే అయినా కోల్‌కతా బాగానే పోరాడింది. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. అయితే బ్యాటింగ్ విభాగం నిరాశపరిచిందని కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వివరించాడు. బెంగళూరు బౌలర్ హసరంగాను ఆడటంతో తాము పొరపాటు చేశామని పేర్కొన్నాడు. అతడి ఆఫ్‌ స్పిన్‌ను ఆటడంలో ప్రణాళికలు అమలు చేయడంలో తమ బ్యాట్స్‌మెన్ విఫలమై మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో తాము 128 పరుగులే చేసినా తమ బౌలర్లు ఈ మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకువెళ్లడంపై గర్వపడుతున్నట్లు శ్రేయాస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. చివర్లో వెంకటేష్ అయ్యర్‌కు బౌలింగ్ ఇవ్వడం సరైందేనని సమర్థించుకున్నాడు. అంతర్జాతీయ అనుభవం ఉండటం వల్లే వెంకటేష్ అయ్యర్‌కు బౌలింగ్ ఇచ్చామన్నాడు. ఈ పిచ్‌పై విపరీతమైన పేస్, బౌన్స్ ఉందని.. దానిని బెంగళూరు బౌలర్ హసరంగా అద్భుతంగా వినియోగించుకున్నాడని కొనియాడాడు. తమ ఓటమికి కారణం హసరంగ అని.. అతడిని ఆడకపోవడమే తాము చేసిన తప్పిదమని శ్రేయాస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు.

https://ntvtelugu.com/yuzvendra-chahal-sensational-comments-on-royal-challengers-bangalore/
Exit mobile version