Site icon NTV Telugu

Kapildev: బ్రేకింగ్.. కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్.. వీడియో వైరల్

Kapil

Kapil

Kapildev: కపిల్ దేవ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. భారతీయులందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత దిగ్గజ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా కలిపి దేవ్ కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన జీవితంపై బయోపిక్ కూడా వచ్చింది. ఇక తాజాగా కపిల్ దేవ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు కపిల్ చేతులు కట్టేసి.. నోరు కట్టేసి..ఆయనను తీసుకెళ్తున్నట్లు కనిపించారు.కొంత‌దూరం వెళ్లాక క‌పిల్ వెన‌క్కి తిరిగి ఏదో సైగ‌లు చేయ‌డం క‌నిపించింది. ఇక దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది.

Sneha Nambiar: శరత్ బాబు నా భర్త కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు

కపిల్ కు ఏమైంది.. ? ఎవరు ఆయనను కిడ్నాప్ చేశారు.. ? అంటూ ఒకటే కామెంట్స్ పెడుతున్నారు. అదికాక ఈ వీడియోను మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అసలు ఏం జరిగింది.. ? అనేది తెలియదు కానీ, అందులో ఉన్నది మాత్రం కపిల్ కాదని గంభీర్ చెప్పుకురావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ” ఈ వీడియో నాకే వ‌చ్చిందా..? ఇంకెవ‌రికైనా వ‌చ్చిందా..? అందులో ఉన్న‌ది నిజ‌మైన క‌పిల్ దేవ్ కాద‌ని అనుకుంటున్నా. నిజ‌మైన క‌పిల్‌దేవ్ బాగానే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోలో ఉన్న అతను ఎవరు..? ఎవరైనా రీల్ చేశారా.. ? లేక ఫ్రాంక్ చేశారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version