దాదాపు ఏడాది విరామం తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ఈరోజు క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో ప్రారంభమైన టెస్ట్‌లో మైదానంలో అడుగుపెట్టాడు. తన పునరాగమన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేన్ అర్ధ సెంచరీ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేన్ మామ చివరిసారిగా 2024 డిసెంబర్ 12-17 మధ్య హామిల్టన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 353 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
డెవాన్ కాన్వే డకౌట్ అయ్యాక న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కేన్ విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కఠినమైన పిచ్‌పై కౌంటర్ అటాక్ ఇన్నింగ్స్‌తో బ్లాక్‌క్యాప్స్‌కు అండగా నిలిచాడు. కివీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టినా.. కేన్ మామ క్రీజులో నిలిచి విలువైన 52 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన న్యూజిలాండ్ రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ నిలిచాడు. ఈ జాబితాలో రాస్ టేలర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై టేలర్ 1136 చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో వెస్టిండీస్‌పై తన ఎనిమిదో ఫిఫ్టీని నమోదు చేశాడు. దాంతో నాథన్ ఆస్టెల్ రికార్డును సమం చేశాడు. టేలర్‌ను దాటి వెస్టిండీస్‌పై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ బ్యాటర్ల జాబితాలో కేన్ అగ్రస్థానానికి చేరాడు.
Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026కు సూపర్ స్టార్స్ దూరం.. లిస్ట్ పెద్దదే గురూ!
వెస్టిండీస్‌పై అత్యధిక టెస్ట్ పరుగులు:
# రాస్ టేలర్ – 1136
# కేన్ విల్లియమ్సన్ – 1022
# గ్లెన్ టర్నర్ – 855
# బి.ఇ. కాంగ్డన్ – 764
# నాథన్ ఆస్టెల్ – 715
వెస్టిండీస్‌పై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు:
# నాథన్ ఆస్టెల్ – 8
# కేన్ విల్లియమ్సన్ – 8
# బి.ఇ. కాంగ్డన్ – 7
# రాస్ టేలర్ – 7
# స్టీఫెన్ ఫ్లెమింగ్ – 6
