NTV Telugu Site icon

అశ్విన్‌పై రూట్‌ ప్రశంసలు…

భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ పై ఇంగ్లాండ్ సారథి జో రూట్  ప్రశంసలు కురిపించాడు. అశ్విన్‌ వరల్డ్‌ క్లాస్ ప్లేయరని, సొంత మైదానంలో ఎంతో విలువైన ఆటగాడన్నాడు ఎడమచేతి వాటం ఆటగాళ్లపై అతడికి ఉన్న రికార్డు ఎవరికైనా కాస్త గమ్మత్తుగా అనిపిస్తుందన్నాడు. గత మ్యాచ్‌లో శతకం బాదడం, లీచ్‌ బౌలింగ్‌లో అతడు ఆడిన తీరుని గమనించానని కొనియాడారు. అయితే భారత్‌ తరఫున 400 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలవడానికి రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు దూరంలో ఉన్నాడు. ఆ ఘనత సాధిస్తే ప్రపంచ క్రికెట్‌లో 400 వికెట్లు మార్క్‌ను అందుకున్న 16వ బౌలర్‌గా అశ్విన్‌ నిలుస్తాడు.